
యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన వ్యక్తిగత విశ్వాసాలు, దైవచింతనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనంలో తనకు ఏదైనా కష్టం వస్తే దేవుడినే తన తండ్రిగా భావించి ఆయనతో పోట్లాడేదాన్నని, కానీ ఇప్పుడు ఆ దేవుడి నిర్ణయాలనే పూర్తిగా విశ్వసిస్తున్నానని తెలిపారు. శుక్రవారం నాడు ఓ ఆలయంలో ప్రశాంతంగా ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు..
“నాకు గుర్తుంది..చిన్నప్పుడు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను చేసే మొదటి పని దేవుడితో గొడవపడటమే. ఆయనే నా తండ్రి అన్నట్లు ప్రతీసారి ప్రశ్నించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఓ దశకు చేరుకున్నాను. నాకేది మంచిదో ఆయనకు కచ్చితంగా తెలుసని ఇప్పుడు నేను నమ్ముతున్నాను” అని తన పోస్టులో ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి..!!

