రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ భాగ్య శ్రీ బోర్స్. ఆ సినిమా సక్సెస్ అందుకోలేకపోయినా కూడా భాగ్యానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ పాపులారిటీతోనే భాగ్య శ్రీ వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ రామ్ తో ఒక లవ్ స్టోరీ చేస్తుంది భాగ్య శ్రీ. రామ్, భాగ్య శ్రీ జోడీ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు. వీటితో పాటు దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటిస్తున్న ‘కాంతా’ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
మిస్టర్ బచ్చన్ సక్సెస్ అవ్వకపోయినా భాగ్య శ్రీకి భలే ఆఫర్లు వచ్చాయి. ఐతే ప్రస్తుతం అమ్మడు చేస్తున్న ఈ 3 సినిమాలు కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వేటికవే చాలా ప్రత్యేకతతో వస్తున్నాయి. సో అందులో ఏ ఒక్కటి హిట్ పడినా భాగ్య శ్రీ టాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లామర్ షో విషయంలో కూడా భాగ్య శ్రీ నో లిమిట్స్ అనేస్తుందని తెలుస్తుంది. సో భాగ్యం తొలి సినిమా వర్క్ అవుట్ కాకపోయినా రాబోతున్న సినిమాలైనా సక్సెస్ అందిస్తాయేమో చూడాలి..!!