in

Bhagyashree Borse Replaces Sreeleela for lenin!

బాక్సాఫీస్ వద్ద తొలి హిట్ కోసం అక్కినేని అఖిల్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో అనేక మార్పులు జరిగాయి. మొదట శ్రీలీలతో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తర్వాత భాగ్యశ్రీ బోర్సేతో మళ్లీ తీశారు..

అలాగే సినిమాటోగ్రాఫర్ మార్పుతో పాటు కీలక సన్నివేశాలను రీషూట్స్ కూడా చేశారు. ఇటీవల అఖిల్ పాత్రపై ఆసక్తికర రూమర్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఆయన అంధుడిగా కనిపించనున్నాడనే టాక్ ఉంది. అయితే పూర్తి స్థాయిలోనా లేక కొన్ని సన్నివేశాల్లో మాత్రమేనా అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!

THE REAL HUMAN– DANIEL BAALAJI

regina cassandra to romance thala ajith again?