in

Bhagyashree Borse gets another crazy offer in tollywood!

ముంబై భామ తెలుగులో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. తాను నటించిన ఒక్క  సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇంకో రెండు సినిమాలకి ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ లో ‘యారియాన్ 2’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ కంట్లో పడింది. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి బాగ్యశ్రీని తీసుకున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరిన్ని అవకాశాలు అందుకుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో భాగ్యశ్రీ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో మొదట శ్రీలీలని తీసుకున్నారు. పూజా కార్య క్రమాల్లో కూడా పాల్గొంది, ఇప్పుడు ఆ ప్లేస్ భాగ్యశ్రీ కొట్టేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్న సినిమాలో భాగ్యశ్రీకి ఛాన్స్ దక్కినట్లు సమాచారం. తక్కువ కాలంలో స్టార్ హీరోలు, దర్శకులు దృష్టిలో పడి బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు కొట్టేస్తుంది..!!

viral : Tripti Dimri of Animal fame purchases rs14 crore house

Nitin and Nithya Menon to team up again!