నేటి చైల్డ్ ఆర్టిస్టులే రేపటి హీరో, హీరోయిన్లు అనుకుంటారు, అలా అయిన వారి సంఖ్య తక్కువే, అందులో సక్సెస్ఫుల్ గ కెరీర్ కొనసాగించిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. మాస్టర్ భరత్ చైల్డ్ కమెడియన్ గ వెండి తెర మీద నువ్వులు పూయించారు, పోకిరి, ఢీ, రెడీ, వెంకీ, నమో వేంకటేశ, దూకుడు ఇలా చాల సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో, డైలాగు డెలివరీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ” చిట్టి నాయుడు” (భరత్), పెద్ద వాడయ్యాకా కొన్ని సినిమాలలో హీరో ప్రక్కన నటించాడు,కానీ క్రమంగా తెర మరుగు అయిపోయాడు, కారణం ఏమిటి? వెండి తెర మీద నువ్వులు పూయించిన చాలా మంది కమెడియన్స్ జీవితాలలోకి తొంగి చూస్తే కొంత విషాద ఛాయలు కనిపిస్తాయి. వీటన్నిటికీ అతీతం గ ఎదిగిన ఒకే ఒక నటుడు “అలీ”, చైల్డ్ ఆర్టిస్ట్ గ కెరీర్ ప్రారంభించి ఈనాటికి తెర మీద కనిపిస్తున్న ఏకైక నటుడు అలీ మాత్రమే, ” హి ఇస్ యాన్ ఎక్సెప్షన్”. మందలో కలసిపోయి తెర మెరుగైన చైల్డ్ ఆర్టిస్ట్ లు కోకొల్లలు.
అందరిని నవ్వించే కమెడియన్స్ కి అసలు ఎటువంటి కష్టాలు ఉండవు, వారు నిజ జీవితం లోను చాల జాలీ గ, హ్యాపీ గ ఉంటారు అనుకుంటారు అందరు సహజంగా.కానీ వారి నిజ జీవితాల్లో గుండెలు తరుక్కుపోయే బాధలు, కష్టాలు ఎదుర్కుంటారు చాలామంది. ఆ కోవలోనే మాస్టర్ భరత్ కూడా నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడట. చెన్నై లో చదువుకుంటున్న సమయం లో ఒక భారీ ఆక్సిడెంట్ కు గురి అయ్యాడట, దాని కారణంగా ఒక్క సారిగ సన్నబడిపోయాడు. ఆ తరువాత ఫిట్నెస్ కోసం జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్నపుడు కంటిలో రాడ్ గుచ్చుకొని బ్లాక్ ఏర్పడింది, ఎన్ని రకాల ట్రీట్మెంట్ లు తీసుకున్న కూడా ఆ సమస్య నుంచి బయటపడ లేక పోయాడు. ఇన్ని సమస్యల మధ్య డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసాడు భరత్, కానీ అందరిని నవ్వించిన భరత్, డాక్టర్ గ ఎదిగిన భరత్, తన ఆరోగ్య సమస్యలను అధిగమించలేక పోయాడు, కేవలం ఈ కారణం గ భరత్ వెండి తెర కు దూరం అవ్వ వలసి వచ్చింది. భరత్ త్వరలో కోలుకొని మళ్లీ వెండి తెర మీద నవ్వులు పూయించాలని ఆశిద్దాము. ” చిట్టి నాయుడు! బెస్ట్ అఫ్ లక్”