యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో..తొలి మూవీతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్‌కు సరైన హిట్ లభించలేదు. దీంతో ఈ యంగ్ మీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన `ఛత్రపతి` బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే పేరుని ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ `టైగర్ నాగేశ్వర రావు` బయోపిక్ ఇది. నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు.
చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు `టైగర్` అనే పేరు వచ్చింది. పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాలతో `స్టూవర్టుపురం దొంగ` సినిమాను తెరకెక్కించబోతున్నారు..నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు. ఈ చిత్రానికి ఎ.ఎస్. దర్శకత్వం వహించగా, 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం ప్రముఖ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు.