
ఇప్పటికే శివ కార్తికేయని హీరోగా పెట్టి.. ‘పరాశక్తి’ సినిమాలో మెరిసింది..సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలో సినిమా గ్రాండ్ లెవెల్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో..శ్రీ లీలకు కోలీవుడ్‌లో మంచి బ్రేక్ దొరుకుతుందని ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. పరాశక్తి సినిమా రిలీజ్‌కి ముందే..శ్రీ లీల కోలీవుడ్‌లో మరొ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా..ఈ కొత్త సినిమాలో కూడా శ్రీ లీలతో శివ కార్తీకేయన్ హీరోగా మెరవనున్నాడట.
వీళ్లిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కనున్న క్రమంలో.. ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఫ్యాన్స్ లో మాత్రం నిరుత్సాహం కనిపిస్తుంది. దానికి కారణం వరుసగా మొదటి రెండు సినిమాలు ఒకే హీరోతో చేస్తే ఆమె కెరీర్ గ్రోత్ కు అది కాస్త ఇబ్బంది అవుతుందేమో అనే టెన్షన్ ఫాన్స్ లో మొదలైందట. రిపీటెడ్ గా ఒకే హీరోతో సినిమాలు చేస్తే ఆమె ఇమేజ్ పడిపోతుందేమో..కొత్త హీరోస్‌తో ట్రై చేస్తే బాగుంటుంది..వెరైటీ రోల్స్ ఎంచుకుంటే ఆమె కెరీర్‌కు అది ప్లస్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..!!
