ఇకపోతే ఈ ఏడాది 2022లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఏడు సినిమాలలో ఆరు సినిమాలు బాలీవుడ్ సినిమాలే కావడం విశేషం. విభిన్న పాత్రల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇక ఛత్రవాలీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ గా కనిపించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నా రన్ వే-34, అజయ్ దేవ్ గన్ సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న థ్యాంక్స్ గాడ్, ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న డాక్టర్ జీ సినిమా ఇలా పలు సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తాను చేసిన సినిమాల్లో పాత్రలు గురించి పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించింది.
ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో 2022 బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను.. ఎందుకంటే నేను నటించిన ఏడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. వాటిలో ఆరు సినిమాలు బాలీవుడ్ సినిమాలే. ఇక ఆ సినిమాలు అన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలి అని కోరుకుంటున్నాను.. సినిమాలలో విభిన్న పాత్రలు పోషించాను అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఛత్రవాలీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రలో నటించాను. రన్ వే-34 సినిమాలో పైలెట్ గా నటించాను. డాక్టర్ జీ సినిమాలు గైనకాలజిస్ట్ పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చింది. ఇక తాను నటించిన సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.