ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సినిమా పూర్తైన తర్వాత కూడా ఒక్కరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోందని పేర్కొన్నారు. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ, సినిమాను తన భుజాలపై మోస్తోందని ప్రశంసించారు. “నిధిని చూస్తే నిజంగా సిగ్గేసింది. ఆమె కెరీర్‌ను పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయం” అని చెప్పారు..
అలానే ప్రమోషన్ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ..ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి కళలు నేర్చుకున్నానని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉండబోతుందని..తన పాత్రకు ఓ ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెప్పింది. అయితే లిప్‌లాక్ సీన్లు, బికినీ వేషాలు తాను చేయనని.. పేరెంట్స్‌తో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చు అంటూ వెల్లడించింది..!!