in

Beauty menakshi chaudhary to romance icon star?

ల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జులాయి’ ..’S/O సత్యమూర్తి’ .’అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చాయి. ఈ మూడు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో కథానాయికగా ముందుగా పూజ హెగ్డే పేరు వినిపించింది. ‘అల వైకుంఠపురములో’ కాంబినేషన్ రిపీట్ కానుందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు తెరపైకి వచ్చింది. ఆరంభంలో మీనాక్షి చౌదరికి చెప్పుకోదగిన సినిమాలు పడకపోయినా, ఆ తరువాత విజయ్ ..మహేశ్ బాబు.. దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో చేస్తూ వెళ్లింది. ‘లక్కీ భాస్కర్’ ఆమెకి మంచి సక్సెస్ ను అందించింది. అంతేకాదు వెంకటేశ్ తో ఆమె చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

UI Overall Review!

HAPPY BIRTHDAY Tamannaah Bhatia!