తనికెళ్ళ భరణి గారి దర్శకత్వం లో వచ్చిన ప్రయోగాత్మకమయిన చిత్రం” మిధునం” ..కేవలం రెండు పాత్రలతో నిర్మించిన చిత్రం మిధునం, అందులో నటించిన బాలసుబ్రహ్మణ్యం గారు తనికెళ్ళ భరణి గారికి ఇచ్చిన కితాబు ఏమిటో తెలుసా? తన పాత్ర ఔచిత్యం కి బాలు గారు ఎంతో ప్రభావితం అయ్యారు. ఆ చిత్రం గురించి బాలు గారు మాట్లాడుతూ, నేను ఎన్నో వేల పాటలు పాడాను, తెర మీద ఎన్నో పాత్రలు పోషించాను, కానీ మిధునం లో తన పాత్ర వలన వచ్చిన తృప్తి అనిర్వచనీయం అయినది. ఒక వేళ నా జీవిత చరిత్ర రాయటం అంటూ జరిగితే మిధునం చిత్రానికి ముందు, మిధునం చిత్రం తరువాత అని వ్రాయ వలసి వస్తుంది అంటూ తనికెళ్ళ భరణి గారిని ప్రశంసించారు. అంటే బాలు గారి కెరీర్ ని రెండుగా చేయగలిగినంత గొప్ప పాత్ర అది, ఆ ప్రశంశను ఆశీర్వాదం గ తీసుకొన్నారు భరణి గారు..