క్రిష్ దర్శకత్వంలో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నందమూరి బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అఖండ విజయం తర్వాత ఫ్యాన్స్‌తోపాటు సినీ పరిశ్రమలోనూ ఉత్సాహం వచ్చింది. అఘోరగా బాలకృష్ణ తన విశ్వరూపం చూపించారని అంటున్నారు. ‘అఖండ’ను చూసిన వాళ్లంతా ఈ సినిమా టీమ్ ని ఎంతగానో అభినందిస్తున్నారు. బాలకృష్ణ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కూడా తన స్పందనను తెలియజేశారు.
‘అఖండ’ సినిమా అద్భుతంగా ఉంది..అప్పుడు తాతగారు .. ఇప్పుడు నాన్నగారు సినిమా పరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలకమైన పాత్రను పోషించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంది. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కూడా డెఫినెట్ గా ఈ సినిమాను చూడాలి. ఈ సందర్భంగా మా మదర్ ను .. ఫాదర్ ను కంగ్రాట్యులేట్ చేయాలనుకుంటున్నాను అని తెలియజేశారు.