అప్పట్లో స్టార్ హీరో బాలకృష్ణ ఎన్నో సినిమాలలో నటించి, తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక బాలకృష్ణ బాలీవుడ్ లో 1990 సంవత్సరంలో అడుగు పెట్టాల్సి ఉంది.. కానీ తెలుగులో అంకుశం సినిమాకి కోడి రామకృష్ణ దర్శకుడిగా వ్యవహరించాడు.ఇక తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని , గీతా ఆర్ట్స్ నిర్మాణంపై రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో 1990 సెప్టెంబర్ నెలలో ప్రతి బంద్ విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు. అలా హిందీలో చిరంజీవి తన మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు..
ఇక ఇదే తంతు లోని టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్లో సినిమాలలో నటించి మంచి ఘన విజయాన్ని అందుకున్నారు. అలా ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం. బాలకృష్ణ తో కలసి హిందీ లో ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడట. ఈ చిత్రానికి దర్శకుడు ఎన్. చంద్రను కలవడం కూడా జరిగిందట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే తేజాబ్ సినిమాతో బాగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి టాప్ నటి మాధురి దీక్షిత్‌ను బాలకృష్ణ సరసన నటించేందుకు తీసుకోవాలనుకున్నారు. కానీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ తెలుగులో నటించడానికి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె వాటిని తిరస్కరించింది.
కానీ డైరెక్టర్ నిర్మాత పట్టుబట్టి ఆమెను ఒప్పించడం చేశారు. అలా ఆమె ఈ ప్రాజెక్టును ఒప్పుకోవడం కోసం కొద్దిగా ఆలస్యం అయింది. అయితే డైరెక్టర్ చంద్ర డేట్స్ మటుకు రెండు సంవత్సరాల వరకు ఖాళీగా లేకపోవడంతో సినిమా వాయిదా పడింది. కానీ డైరెక్టర్ డేట్స్ దొరికే సమయానికి బాలకృష్ణ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. అలా బాలకృష్ణ బాలీవుడ్ సినిమాకు మధ్యలోనే బ్రేక్ చెప్పవలసి వచ్చింది. ఒకవేళ బాలీవుడ్లో కూడా బాలకృష్ణ నటించిన ఉండుంటే ఆయన రేంజ్ బాలీవుడ్లో కూడా మరింత ఉన్నతంగా ఉండేదేమో..!