in

BALAYYA BABU KU MOODU SHARATHULU PETTINA N.T.R!

భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ” మంగమ్మ గారి మనవడు ” చిత్రంలో నటించే సందర్భం గ, యెన్.టి.ఆర్. బాలకృష్ణ కు మూడు షరతులు పెట్టారట. ఆ చిత్రంలో బాలకృష్ణ గారికి నాయనమ్మ గ సీనియర్ నటి భానుమతి గారు నటించారు. యెన్,టి,ఆర్. బాలకృష్ణ గారికి పెట్టిన షరతులు ఏమిటంటే. 1 . భానుమతి గారి కంటే ఒక అరగంట ముందు సెట్ లో ఉండాలి , 2 . భానుమతి గారి కారు రాగానే బాలయ్య బాబే కారు డోర్ తీయాలి, 3 . ఆవిడా కారు దిగగానే ఆమెకు పాదాభివందనం చేసి సెట్ లోకి తీసుకొని రావాలి.

షూటింగ్ ప్రారంభం అయింది యెన్.టి.ఆర్. మాటలను తూ.చ. తప్పకుండ పాటించారు బాలయ్య బాబు. బాలయ్య బాబు వినయం చూసిన భానుమతి గారు సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బయ్యి, మీ నాయన గారి పెంపకం అంటూ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాయన. నువ్వు ఆంధ్ర దేశం గర్వించతగ్గ నటుడివి అవుతావు అని ఆశీర్వదించారట. సీనియర్ నటులు, డైరెక్టర్ లు, నిర్మాతలు అంటే యెన్.టి.ఆర్.కి ఎంత గౌరవమో దీనిని బట్టి చెప్ప వచ్చు .

senior actress Jayaprada in Nagarjuna’s Bangarraju?

surekha vani’s daughter supritha slips her tongue about taking wine!