
బాలయ్యకు జైలర్ 2 కోసం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఓ ప్రత్యేక పాత్రను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కీ రోల్‌లో నటిస్తారా లేదా గెస్ట్ అప్పియరెన్సేనా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాలయ్య పాత్రపై భారీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య ఈ సినిమా కోసం 20 రోజుల కాలం కేటాయించనున్నారని, రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం. ఇప్పటివరకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ రూ.20 నుంచి 30 కోట్ల మధ్యే ఉండేది. గెస్ట్ రోల్‌కే ఈ స్థాయిలో ఫీ తీసుకోవడం ఆయన స్టార్డమ్‌ను మరోసారి రుజువు చేస్తోంది..!!

