వీర సింహారెడ్డి లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. దీన్ని బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న ప్రారంభించనున్నట్లు టాక్. ఇక బాలయ్యను పవర్‌ఫుల్ రోల్‌లో చూపించాలంటే బోయపాటి తర్వాత ఎవరైనా అంటుంటారు. కాగా..వీర సింహారెడ్డి సినిమాలో ఆయనను మించిపోయే రేంజ్‌లో బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేశాడు గోపీచంద్. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుంది.
ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య సరసన ఈ మూవీ హీరోయిన్గా త్రిష నటించబోతుందని సమాచారం. అంతే కాదు.. ఇందులో మరో హీరోయిన్ మాళవిక మోహన్ కనిపించనుంది. ఆమె ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే పదేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్యతో జతకడుతుంది త్రిష. గతంలో లయన్ సినిమాలో ఇద్దరు కలిసి నటించినా అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే అప్పుడు ప్లాప్ ఇచ్చిన త్రిష ఇప్పటికైనా సక్సెస్ ఇస్తుందా.. లేదా..అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి..!!