నందమూరి నట వారసుడు నందమూరి బాలకృష్ణ తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు, తన కల్మషం లేని ప్రేమతో అభిమానుల మనసు దోచారు, అన్ స్టాపబుల్ ప్రోగ్రాం తో అందరి గుండెల్లో కాక రేపారు. ఆరు పదులు దాటినా,తన హుషారయిన హోస్టింగ్ తో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం రేటింగ్ పెంచేశారు. అభిమానులు ప్రేమగా “బాలయ్య” అని పిలుచుకుంటారు, సినీ వర్గాలు “బాలయ్య బాబు” అని పిలుచుకుంటారు, మరి ఆయన మనవళ్లు ఆయనను యేమని పిలుస్తారో తెలుసా? తెలియదు కదూ! ఈ మధ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రమోషన్ కార్యక్రమం లో బాలయ్య బాబు తాను సృష్టించబోయే బుల్లి తెర సునామి గురించి చెపుతున్న సందర్భం లో,యాంకర్ నేను మిమ్మల్ని “మావయ్య” అని పిలవ వచ్చా అని అడగగానే, నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు, నువ్వు మావయ్య అంటావా అంటూ చమత్కరించారు.
వెంటనే సదరు యాంకర్ మరి యేమని పిలుస్తారు సార్ అని అడగగానే ఒక చిరు దరహాసం చేసిన బాలయ్య, “బాల” అని ముద్దుగా పిలుచుకుంటారు అని చెప్పి మురిసిపోయారు.నిజమే తాత మనవళ్ల అనుబంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది, తన కడుపున పుట్టిన బిడ్డల కంటే, తన బిడ్డల కడుపున పుట్టిన వారితో ఎంతో అనుబంధం, చనువు పెంచుకుంటారు తాతయ్యలు. అందుకే వారి ముందు చిన్న పిల్లలై పోయి వారితో పేరు పెట్టి పిలిపించుకోవటం, ఒరే తాతయ్య ” ,” ఒరే ముసిలి”,” మీసాలు” వంటి ముద్దు పిలుపులు పిలిపించుకొని మురిసిపోతుంటారు. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ పవర్ కి తగ్గట్టుగానే ఆయన మనవళ్లు ఆయనను “బాల” అని పిలచుకుఁటున్నారు, అదో, గొప్ప అనుభూతి, అటువంటి అనుభూతిని ప్రేక్షకులతో పంచుకోవటం బాలయ్య సింపల్సిటీ కి, ఒక నిదర్శనం..!!