నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫంక్షన్‌లో నాటి తరం నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయనతో తనకు గొప్ప అనుబంధం ఉందని అంతటి మహానటుడిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని బాలయ్య అన్నారు. ఈ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఎవరినీ కించపరచాలని తనకు లేదని ఆయన అన్నారు. “నేను ఆయనను బాబాయి అని పిలుస్తాను. ఆయన కూడా నా పట్ల చాలా ఆప్యాయతతో ఉండేవారు. నిజానికి ఆయన సొంత పిల్లల కంటే నాపైనే ఎక్కువ ఆప్యాయత చూపేవారు అని అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ అన్నారు.
పొగడ్తలకు లొంగిపోకూడదని అక్కినేని నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌ని కూడా “ఎన్టీ వోడు” అని పిలుస్తారని బాలయ్య వివరించారు. ఒక్కో ప్రాంతం ఒక్కో భాష, యాసను ఉపయోగిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తామని చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ ”అదంతా ప్రేమ, ఆప్యాయత. నేను కూడా ఇదే కోణంలో మాట్లాడాను తప్పించి ఎవరినీ నొప్పించాలని తనకెంత మాత్రం లేదని అన్నారు. అక్కినేని బాబాయిని అవమానించే ఉద్దేశ్యం నాకు లేదు అని వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. సో ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న మాటల యుద్ధానికి ఇంతటితో తెరపడినట్లే..!!