పదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘భజరంగీ భాయిజాన్’ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో ‘మున్నీ’ పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకున్న బాలనటి ‘హర్షాలీ మల్హోత్ర’. ఇప్పుడీమె తెలుగు సినిమాల్లో అడుగుపెట్టనుంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ-2’లో నటిస్తోంది. ఈమేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా హర్షాలీ ‘జనని’ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించింది టీమ్..
ఈమేరకు ఆమెకు స్వాగతం చెప్తూ హర్షాలీ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. ‘భజరంగీ భాయిజాన్’ సినిమా ఆమెదే కీలకపాత్ర. తన చుట్టూనే సాగే కథలో బధిర పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. సినిమాలో ఆమె నటనకు అవార్డులు సైతం వరించాయి.
పలు సీరియళ్లలో నటించిన ఆమెకు ‘భజరంగీ భాయిజాన్’తో మంచి గుర్తింపు వచ్చింది. బాలకృష్ణ హీరోగా 2021లో వచ్చిన అఖండ మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా అఖండ-2 తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది..!!