in

Bad Phase still continues for Krithi Shetty!

మూడేళ్ళ క్రితం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఒక్కసారిగా డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనకే ఆఫర్లు క్యూ కట్టాయి. లుక్స్, నటన రెండూ బాగుండటంతో తక్కువ టైంలో టాప్ ప్లేస్ కి దూసుకుపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సూపర్ హిట్లు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి.

కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పలకరించాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది. సరే జరిగిందేదో జరిగింది శర్వానంద్ మనమేతో మళ్ళీ ట్రాక్ లో పడొచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది. కానీ తీరా చూస్తే మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం…!!

Nitin and Nithya Menon to team up again!

Sreeleela To Make Bollywood Debut Opposite Saif Ali Khan’s Son Ibrahim?