బాబు మోహన్ కుమారుడు కూడా ఇలానే స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే…. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించారు. యాక్సిడెంట్ లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరూ చెలగాటం ఆడొద్దని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిరు వాపు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని బాబు మోహన్ వాపోయారు.
సాయితేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పనిచేశాడని మోహన్ బాబు తెలిపారు. ‘కొందరు హెల్మెట్ పుట్టుకోవడాన్ని నామోషీలా ఫీలవుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయ్యి యాక్సిడెంట్ కాగానే చతికిలపడుతారు. లేకపోతే అతన్ని నమ్ముకున్న వాళ్లు చీకట్లోకి వెళ్లిపోతారు. దీనికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ తండ్రి తన కళ్లముందు కుమారుడిని కోల్పోతే తండ్రి శరీరం కాలిపోయే వరకు ఆ దు:ఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ బాధను ఎవరూ తగ్గించలేరు. దయచేసి యూత్ తమ కుటుంబాన్ని గుర్తు చేసుకొని బైక్ నడపాలి’ అంటూ బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.