in

BAAPU GURTHINCHINA IDDARU HEROLU!

వి గాంచని చోట కవి గాంచును” అని తెలుగులో ఒక నానుడి ఉంది , అలాగే చిత్రకారుడి కుంచె రాబోయే కాలపు అద్భుతాలను, అందాలను ముందే గుర్తించి చిత్రాలు గీస్తుందేమో అనటానికి నిదర్శనం ఈ సంఘటన.1978 లో ” మనవూరి పాండవులు” సినిమా షూటింగ్ లో ఇద్దరు కొత్త కుర్రాళ్ళు కెమెరా ఫ్రెమ్ లోకి రాగానే దర్శకుడు బాపు గారి కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యేవి అట. ఆ షూటింగ్ జరుగుతూ ఉన్నంత సేపు బాపు గారు నిరంతరాయంగా వీరిద్దరి బొమ్మలు వేస్తూనే ఉండేవారట.

కెమెరా మాంత్రికుడు బాలు మహేంద్ర ఈ సినిమాకు కెమెరా మాన్, అయన కూడా వీరిద్దరూ ఫ్రేమ్ లోకి రాగానే డిఫ్ఫరెంట్ ఫ్రేమ్స్ లో తన కెమెరా కన్ను తో వీరిద్దరినీ చూస్తూ ఉండేవారట. ఆ కుర్రాళ్ళు ఇద్దరు ఆ సినిమాలో సెకండ్ లీడ్ రోల్స్ చేసారు, ఆ తరువాతి కాలం లో బాపు గారు ఒక కుర్రాడు హీరో గ అద్భుతమయిన సినిమా చేసారు, మరో కుర్రాడితో బాలు మహేంద్ర అవార్డు విన్నింగ్ సినిమా చేసారు. ఇంతకీ ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు అనేగా మీ సందేహం? ఒకరు మెగా స్టార్ చిరంజీవి, మరొకరు భాను చందర్. మనవూరి పాండవులు షూటింగ్ లో బాపు గారు రమణ గారితో చెప్పే వారట, వీరిద్దరి కళ్ళల్లో అద్భుతమయిన స్పార్క్ ఉంది, వీరిద్దరూ పెద్ద స్టార్స్ అవుతారు అని. బాపు గారు అన్నట్లుగానే, ఇద్దరు పెద్ద స్టార్స్ అయ్యారు.

ఒకరు తెలుగు సినీ ప్రేక్షకులకు బ్రేక్ డాన్స్ లు, ఒరిజినల్ ఫైట్ లు పరిచయం చేసి తన ప్రతిభ తో మెగా స్టార్ గ ఎదిగారు. అదే విధంగా తెలుగు సినీ ప్రేక్షకులకు మార్షల్ ఆర్ట్స్ ను పరిచయం చేసి, తన రియలిస్టిక్ నటనతో చిరంజీవి గారి రేంజ్ లో కాకపోయినా, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు భానుచందర్. భాను చందర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ కంపోజర్, రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గ రాణిస్తున్నారు. ఇక చిరంజీవి గారి గురించి మనం కొత్తగా చెప్పేది ఏముంది, తెలుగు సినిమాయే అయన, ఆయనే తెలుగు సినిమా అన్నంతగా ఒక” సినీ వట వృక్షం” లాగా ఎదిగారు, ఎందరో ఔత్సాహిక కళాకారులకు స్ఫూర్తి గ నిలిచారు..

Rashi Khanna shared her dating secret with Naga Chaitanya!

SAAHITHI VENNELA –SIRIVENNELA!