
ఇటీవల అవికా గోర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. ‘కొత్త ప్రారంభం’ అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన పోస్ట్‌ను చూసి, అవికా తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టగా, మరికొందరు ఇది ఒక హింట్ అని భావించారు. అయితే ఈ ప్రచారంపై తాజాగా అవికా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు..
తన గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవికా గోర్ ఖండించారు. తాను తల్లి కాబోతున్నానన్న ప్రచారం పూర్తిగా రూమర్స్ మాత్రమేనని చెప్పారు. అసత్యమైన విషయాలను ఎందుకు ఇంత వేగంగా షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న మాట లేదా పోస్ట్ చూసి అభిమానులు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వార్తలు తనను అసౌకర్యానికి గురిచేస్తున్నాయని కూడా తెలిపారు..!!