స్వాతిముత్యం’తో ఆకట్టుకున్నాడు హీరో బెల్లంకొండ గణేష్. దసరాకి వచ్చిన ఈ సినిమా రెండు పెద్ద సినిమాల మధ్య కూడా నిలబడింది. గణేష్ కి మంచి మార్కులు పడ్డాయి. తన రెండో సినిమాగా ”నేను స్టూడెంట్ సార్!’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అవంతిక దస్సానిని ఎంపిక చేశారు. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాతో అరంగేట్రం చేస్తోంది. ఫస్ట్ లుక్ లో స్టైలిష్ అండ్ క్యూట్‌గా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తోంది. రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు..!!