
ఈరోజు అగ్ర దర్శకులలో ఒకడిగా స్థానం సంపాదించిన ఒక దర్శకుడు శ్రీదేవి గారి సినిమా చూడటానికి 40 కిలోమీటర్ లు సైకిల్ తొక్కుతూ వెళ్లి సినిమా చూసి తిరిగి వచ్చేవారు ఆంటే ఆశర్యం గ ఉంది కదూ, కానీ ఇది నిజం. చిరంజీవి గారి కి ”సైరా” వంటి మరపురాని విజయాన్ని అందించిన దర్శకుడు, సురేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా, జమ్మికుంట లో పుట్టారు అప్పట్లో సినిమా ఫస్ట్ రిలీజ్ జమ్మికుంటలో అయ్యేవి కాదు, శ్రీదేవి గారికి వీర అభిమాని అయిన సురేందర్ రెడ్డి ఫ్రెండ్స్ తో కలసి ఉదయం 6 గంటలకు బయలుదేరి, వరంగల్ కి సైకిల్ మీద వెళ్లి సినిమా చూసే వారు. వెళ్ళేటపుడు శ్రీదేవి ని చూడబోతున్న ఉత్కంఠ, వచ్చేప్పుడు శ్రీదేవిని చూసేసిన తృప్తి ఎంత దూరం సైకిల్ తొక్కుతున్నాము అనే శ్రమ తెలిసేది కాదు అంటారు సురేందర్ రెడ్డి.సినిమా ఆంటే ఆ ప్యాషన్,అనుకున్నది ఎలాగయినా సాధించాలి అనే ఆ పట్టుదల, ఆయనను సినీ దర్శకుడిని చేసింది, లేకుంటే 40 కిలోమీటర్స్ సైకిల్ మీద వెళ్లి రావటం ఆంటే చిన్న విషయం కాదు.

