
హీరో సుమన్ గారు కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఈ విషయం ఎంతమందికి తెలుసు? సుమన్ గారు సినిమాలలో నటించటం మొదలు పెట్టిన తొలి రోజుల్లో ఒక ఫైట్ సీన్ లో తాను కొట్టిన పంచ్ కు ఫైట్ అసిస్టెంట్ మూతి పగలటమే కాకా ముందు అయిదు పళ్ళు రాలిపోయాయట.కంగారు పడిన సుమన్ గారు ముందే చేప్పాను కదా ఓవర్ లాప్ డిస్టెన్స్ మైంటైన్ చేయమని, అని ఎంతో బాధపడ్డారట.అతనిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశారట.స్పాట్ లో ఉన్న అందరు కంగారు పడి షూటింగ్ ఆపేసి అతనికి సపర్యలు చేయటం మొదలు పెట్టారట. సుమన్ గారయితే చాల ఫీల్ అయిపోయారట అయ్యో నా పొరపాటువలన ఇలా జరిగేందే అని. ఇంతలో స్పాట్లోకి వచ్చిన స్టంట్ మాస్టర్, అతనివి కట్టుడు పళ్లే లెండి, మళ్ళి కట్టించుకుంటాడు మీరు కంగారు పడకండి అన్నారట. విషయం ఏమిటంటే అతనికి ఇంతకు ముందు కూడా ఇలాగె జరిగి ఒరిజినల్ పళ్ళు పోతే కట్టుడు పళ్ళు కట్టించుకున్నాడట. అప్పుడు సుమన్ గారి మనసు కుదుట పడి షూటింగ్ కంటిన్యూ చేశారట.
