ప్రభు సాల్మోన్ ” గజ రాజు” ” ప్రేమ ఖైదీ ” వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్. రానా హీరో గ త్రిభాషా చిత్రం” అరణ్య” చిత్రం డైరెక్ట్ చేసారు. ప్రభు సాల్మోన్ తీసిన అరణ్య చిత్రం అసోం ప్రభుత్వాన్ని కదిలించింది ఏనుగుల కు వాటి హక్కును తిరిగి ఇప్పించింది. అదేమిటో తెలుసుకోవాలని ఉందా? అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారికి అడ్డంగా గోడ కట్టిన ఒక యదార్ధ సంఘటన ఆధారం గ నిర్మించిన చిత్రం అరణ్య.అందులో హీరో ఒక ప్రకృతి ప్రేమికుడు,పర్యావరణ పోరాట యోధుడు. దానికి స్ఫూర్తి అసోం లోనే సొంతగా అడవిని పెంచిన జాదవ్ పోయాంగ్. అటువంటి పోరాటయోధుడు పాత్రను పోషించటానికి ముందుకు వచ్చిన రానా, కేవలం శాఖాహారం తింటూ 15 కిలోలు బరువు తగ్గారు.
నోరులేని ఏనుగుల మూగ వేదనను అర్ధం చేసుకున్న ఈ పోరాటయోధుడు, ఎలా వాటి హక్కుల కోసం పోరాడి విజయుడు అయ్యాడు అనేది కధాంశం. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసారు రానా. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులను కదిలించింది ఈ చిత్రం ఇతివృత్తం. అదే విధం గ అసోం ప్రభుత్వాన్ని కూడా కదిలించింది అరణ్య చిత్రం. అరణ్య రీలీజ్ కి ఒక వారం ముందు, వాళ్ళు నిర్మించిన ఏనుగుల దారిలోని అడ్డు గోడను కూల్చేశారు. ఒక సినిమా ప్రభుత్వ నిర్ణయాలను కూడా మార్చ గలదు అని నిరూపించిన చిత్రం అరణ్య. చెప్పే విషయం లో చిత్త శుద్ధి ఉంటె అది సాధారణ ప్రజలనే కాదు, పాలకులను కూడా కదిలిస్తుంది అని నిరూపించారు రానా మరియు ప్రభు సాల్మోన్..