
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’, ‘థాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా.. చైతు తన నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొచ్చాయి. ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్ సమయంలో పరశురామ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఓ సినిమా కమిట్ అయ్యారు. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ సినిమాను తెలుగులో చైతుతో రీమేక్ చేస్తారంటూ కథనాలను ప్రచురించారు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అని తెలుస్తోంది.