in

Arjun’s Daughter Aishwarya To marry Thambi Ramaiah’s Son Umapathy!

ఫైట్ సీన్స్ అద్భుతంగా చేయాలి అంటే, ముందుగా ఆయన పేరే వినిపించేది. ఆ తర్వాత ఆయన సినిమాలు కాస్త దూరమయ్యారు. అయితే, తన వారసురిలాగా ఆయన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆమె 20213లో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించింది. తమిళం, కన్నడలో ఆమె హీరయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా తీసుకురావాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కాగా, ఇప్పుడు ఆయన తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆమె పెళ్లి చేసుకునేది కూడా ఓ ప్రముఖ నటుడేనట..

అయితే అతను ఓ కమెడియన్ కావడం విశేషం. తమిళనాట ప్రముఖ హాస్యనటుడితో ఐశ్వర్య పెళ్లి జరుగుతోందంటూ ప్రచారం జరుగుగతోంది. ఐశ్వర్య తమిళ సీనియర్‌ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య తో ప్రేమలో ఉందట. వీరిద్దరూ చాలాకాలం నుంచే ప్రేమించుకుంటున్నారట. కాగా, వీరి పెళ్లికి తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన మాత్రం వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఊపందుకుంటోంది..!!

Kajol reveals what is lust according to her!

Suriya is in talks for Karna role in Mahabharat!