ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు చెప్పింది షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాలో అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఫీలైనట్లు తెలిపింది. తెలుగుతో పాటు హిందీ(‘కబీర్ సింగ్‘) లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. “‘కబీర్ సింగ్’ సినిమాను ఎప్పుడూ రీమేక్ చిత్రంగా చూడలేదు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమిస్ట్రీ చక్కగా ఉంది. ప్రీతి క్యారెక్టర్ లో నేను, కియారా చాలా బాగా నటించాం.
చక్కటి భావోద్వేగాలను కనబరిచాం. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించాను. ఏదో ఒక భాషలో నటించాలనే పట్టింపు ఏమా లేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. నేను తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరపైకి అడుగు పెట్టాను. తెలుగు అమ్మాయిని కాకపోయినా, నా తొలి సినిమాకు ఇక్కడి ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ కనిపించింది. వారి ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను” అని షాలిని పాండే వెల్లడించింది..!!