in

“ARE YOU CHIRANJEEVI” ANI CHIRUNE ADIGINA GADUGGAYI!

ఆంధ్ర దేశం లో చిరంజీవి గారిని” మీరేనా చిరంజీవి” అని అడిగే వారు ఉంటారు అని నేను అనుకోను, కానీ ఓ గడుగ్గాయి చిరంజీవి గారిని మీరేనా చిరంజీవి అని అందరి ముందు అడిగేసింది. మురుగదాస్ డైరెక్షన్ లో చిరంజీవిగారు యాక్ట్ చేసిన “స్టాలిన్” సినిమా షూటింగు హైదరాబాద్ ఐ మాక్స్ లో జరుగుతుంది, ఆ షాట్ లో చిరంజీవి గారితో కల్సి నటిస్తున్న బేబీ యాని డైలోగ్స్ చెప్పటానికి తడబడుతుంది.ఐ మాక్స్ లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకే షూటింగ్ కి పర్మిషన్ ఉంది, అంతా టెన్షన్ వాతావరణం. యాని డైలోగ్స్ చెప్పటానికి ఇబ్బంది పడుతుండటం తో, ఆమెను ఎంకరేజ్ చేసే ఉద్దేశం తో చిరంజీవి గారు ఆమె భుజం మీద టాప్ చేస్తూ బాగా చెప్పాలి అనగానే..

యాని ఈయన ఎవరో తనను కోప్పడుతున్నారు అనుకోని అలిగి కూర్చున్నది. చిరంజీవి గారు తన అసిస్టెంట్ కి చెప్పి స్ప్రైట్ తెప్పించి ఇచ్చి ఆమెను కూల్ చేసారు. అంత పూర్తి అయ్యాక షాట్ కు సిద్ధం అవుతూ, మీరేనా చిరంజీవి అని అడిగేసింది యాని. ఆ ప్రశ్న విన్న అక్కడ ఉన్న వారందరు షాక్ అయ్యారు, చిరు నవ్వు నవ్విన చిరంజీవి గారు, అవునమ్మా నేనే చిరంజీవి అంటూ కూల్ గ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆ దెబ్బతో టెన్షన్ ఫ్రీ అయిపోయిన యాని తన డైలోగ్స్ ను సునాయాసం గ చెప్పేసి షాట్ ఓకే చేసేసింది. ఎవరబ్బా ఈ యాని అనుకుంటున్నారా, నాగార్జున నటించిన “రాజన్న” చిత్రం లో నటించిన మల్లమ్మే ఈ యాని, ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది..

How Much You Know About Tollywood? Give it a shot!!

Producer Dil Raju Stops his 10 New Projects!