యూత్‌ని ఆకట్టుకోవాలంటే కథ వెరైటీగా ఉండాలి. మూస కథలకు కాలం చెల్లింది.. థియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలి.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డిజె టిల్లు అలాంటి కథే.. కామెడీ, రొమాన్స్‌ని మేళవించి దర్శకుడు, హీరో కలిసి టిల్లు కథని రూపొందించారు. గత వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. సిద్దులో ఓ రొమాంటిక్ నటుడే కాదు మంచి రచయిత కూడా ఉన్నాడు.. ఆ విషయం అతడి గత చిత్రాల్లోనూ స్పష్టమైంది.. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలకు పని చేసి నటుడిగా, రచయితగా నిరూపించుకున్నాడు. డిజె టిల్లు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సిద్దుకు ఓ ప్రశ్న ఎదురైంది.. ఓ ఇంటర్వ్యూయర్ మీరు సినిమాలో నటితో రొమాన్స్ బాగా చేశారు..
నిజ జీవితంలో ఉమెనైజరా అని అడగంతో సిద్దు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే ఏంటో మీరే అర్థం చెప్పండి అని సిద్దు తిరిగి అతడినే ప్రశ్నించాడు.. మహిళలతో సరసాలడతాడు అని బదులిచ్చారు. దానికి సిద్ధు సినిమాల్లో నటించాల్సి వస్తుంది. కానీ జీవితంలో నేను ఎవరినైనా ఇష్టపడితే వారి ఇష్టం మేరకే ముందుకు వెళతాను అని అన్నాడు. సినిమా సక్సెస్ మీట్‌లో బ్లాక్ బస్టర్ పేరు వినడమే కానీ ఇప్పటి వరకు ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేయలేదు.. ఇప్పుడు డిజె టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. చిన్న సినిమాగా రిలీజై భారీ విజయాన్ని అందుకుంది అని అన్నాడు.