వెండి తెర మీద మన హీరోలు మేక్ అప్ తో, విగ్గులతో చాల అందంగా కనిపిస్తుంటారు. వయసు రీత్యా కొంత మందికి జుట్టు రాలిపోవడం, ముఖం మీద ముడతలు రావటం చాల సహజం, కానీ చాలామంది హీరోలు తమ నిజ స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించటానికి వెనుకాడుతుంటారు. తమ నిజ రూపం చూపిస్తే ఎక్కడ తమ స్టార్ డం తగ్గిపోతుందో అనే భయం తో, నిజ జీవితం లో కూడా విగ్గులు పెట్టుకొని జనం ముందుకు వస్తుంటారు. అందాల నటుడు శోభన్ బాబు గారు తన వయసు మళ్ళిన ముఖాన్ని అందరు చూడటం ఇష్టం లేక చాల సంవత్సరాలు ఇంటికే పరిమితం అయిపోయారు, ఒక రకమయిన మానసిక క్షోభకు గురి అయ్యారు.అక్కినేని నాగేశ్వర రావు గారు, యెన్.టి.ఆర్. కృష్ణ గారు మాత్రం , పంచె కట్టుతో తన నిజ రూపం తోనే అందరికి కనిపించే వారు. సూపర్ స్టార్ రజని కాంత్ అదే బాటలో విగ్గు లేకుండా బట్ట తలతో, కనీసం జుట్టుకు రంగు కూడా వేసుకోకుండా, మేక్ అప్ లేకుండా జనం ముందుకు వస్తుంటారు, దానికి కారణం మీకు తెలుసా? ఒక రోజు రజని కాంత్ గారు బెంగుళూరు లోని ఒక గుడి లో దైవ దర్శనం తరువాత, బయట మండపం లో అరుగు మీద మౌనంగా, ధ్యాన ముద్ర లో కూర్చొని ఉన్నారట, అప్పుడు అటుగా వచ్చిన ఒక మహిళ ఒక పది రూపాయల నోటును ఆయన చేతిలో పెట్టిందట, ఎవరో భిక్షగాడు అనుకొని. ఆ తరువాత రజని బయటకు వచ్చి కార్ ఎక్కుతున్నపుడు ఆయనను గుర్తించి ఆ మహిళ, పరుగున అయన దగ్గరకు వచ్చి, జరిగిన పొరపాటుకు క్షమించమని అడిగిందట..
అప్పుడు రజని లేదమ్మా! నువ్వేమి తప్పు చేయలేదు, నా కళ్ళు తెరిపించావు, అందుకు నేనే నీకు థాంక్స్ చెపుతున్నాను, అని అక్కడ నుంచి వెళ్లపోయారట. ఆ తరువాత ఆయనలో ఏదో తెలియని అంతర్మధనం, ఈ విగ్గులు, మేక్ అప్ లు లేకుండా తన గుర్తింపు ఏమిటి? అనే ప్రశ్న అయన మనసును తొలిచేసింది, అంతే ఇక మీదట తాను జనం ముందుకు తన నిజ స్వరూపం తోనే కనపడాలి, వెండి తెర మీద కనిపించే రూపం తో కాదు. తమ అభిమాన నటుడు ఇలా ఉంటాడు అని అందరికి తెలియాలి, నన్ను నన్నుగా అందరు గుర్తించాలి, నా నటనను మెచ్చాలి, తెర మీది రూపం తో కాదు, ఆ రూపం ఆ పాత్రకే పరిమితం, రజని రూపం, రజనీదే, నా అభిమానులు నన్ను నా నిజ రూపం తో గుర్తించిన నాడే నా నటనకు, నాకు, సార్ధకత అని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన బయట ఎంత పెద్ద ఫంక్షన్ అయినా, విదేశాల టూర్ కి వెళ్లిన మేక్ అప్, విగ్గు లేకుండా రియల్ రజనీకాంత్ గ వెళతారు. అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన నిజ స్వరూపాన్ని చూసి కూడా గుర్తించటం మొదలయ్యాక ఆయనకు ఐడెంటిటీ ప్రాబ్లెమ్ లేకుండా పోయింది. నటుడు తన నటనతో గుర్తింపు పొందాలి, ఆఫ్ కోర్స్ రూపం కూడా అవసరమే కానీ, అది ప్రధానం కాకూడదు, అనే విషయాన్ని రజని నిరూపించారు.జీవితాన్ని చదివిన మనుషులు ఇతరులకు నీతులు చెప్పరు, ఆదర్శంగా నిలుస్తారు అంతే!!!. అందుకే రజని కాంత్ ఇస్ రజని కాంత్, తెర మీది బాషా , ముత్తు, నరసింహ కాదు, అర్ధమయిందా రాజా?