
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] ప్ డైరెక్టర్ గ పేరు పొందిన ఎస్.ఎస్.రాజమౌళి గారి సినిమాలో నటించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొందరి మాత్రమే వస్తుంది.. ఎంతో టాలెంట్ అండ్ లక్ ఉన్న కూడా రాజమౌలి సినిమాలో అందరికి ఛాన్స్ రాదన్నమాట వాస్తవం. అలాంటిది రాజమౌళి గారే స్వయంగా వచ్చి మగధీర సినిమాలో ఒక రోల్ ఉంది చేస్తారా అని అడుగుతే అర్చన చేయను అని చెప్పిందట. ఈ విషయాన్నీ అర్చనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.. “మగధీర సినిమాలో సలోని చేసిన పాత్రా చేయడానికి రాజమౌళి ముందుగా నన్ను అడిగారు, కానీ నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నందున రిజెక్ట్ చేశాను” అని తెలిపింది అర్చన. అంతే కాకుండా సలోని మగధీర లో చేసిన తరువాత ఆమెకి రాజమౌళి గారు ఏకంగా తన నెక్స్ట్ సినిమా ‘మర్యాద రామన్న’ లో హీరోయిన్ గ ఆఫర్ ఇచ్చారు అని కూడా తెలిపింది అర్చన. బహుశా ఆరోజు రాజమౌళి గారికి ఓకే చెప్పి ఉంటె నాకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చి నా కెరీర్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.. అంత అయిపోయాక ఇప్పుడు బాధ పడితే ఏం లాభం చెప్పండి, ఏమాటకి ఆమాట అర్చన గారు మీరు మాత్రం ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు అన్నది మాత్రం నిజం.