
జగపతి బాబు, ఈ పేరు తెలియని తెలుగు సినిమా అభిమాని బహుశా ఉండరు కాబోలు. 90 వ దశకంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఎంతో పేరు ఖ్యాతి సంపాదించారు జగపతి బాబు గారు. ఎంత పెద్ద వారిని అన్నా విధి అనేది వదిలి పెట్టదు కదా, హీరో గ ఇండస్ట్రీ లొ ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో జగపతి బాబు గారికి కొన్నాళ్లకి సినిమా ఆఫర్స్ అన్ని తగ్గుముఖం పట్టాయి. సినిమా అవకాశాలు లేక సంపాదించినా డబ్బు సరిగ్గా దాచుకోలేక చివరికి తన సొంత ఇల్లు ఇంక కార్ ని అమ్మే పరిస్థికి వచ్చారు 2011 లొ జగపతి బాబు గారు. డబ్బులు ఉన్నప్పుడు విచ్చల విడిగా ఖర్చుపెడ్తూ అడిగినవాళ్ళకి అడిగినంత ఇచ్చేస్తు చివరికి తన దగ్గర ఏమి లేని పరిస్థికి చేరుకున్నారు. ఇంత దయనీయ స్థితికి చేరుకున్న ఆయనతో విధి మళ్ళి ఆటాడింది, హీరో గ తన పని అయిపోయింది అని భావించి ఇంట్లో బాధతో కూర్చున్న ఆయనకీ అనూహ్యంగా ‘లెజెండ్’ సినిమా లొ విలన్ రోల్ వచ్చింది. ఆ సినిమా ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది. మళ్ళి సినిమాల్లో ఆఫర్స్ కుప్పలుగా వచ్చాయి. ఇప్పుడు జగపతి బాబు గారు క్షణం తీరిక లేనంత బిజీ గ అయిపోయారు. క్యారెక్టర్ ఇంక విలన్ రోల్స్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తూ మంచి పోసిషన్ కి చేరుకున్నారు.. ” ఇండియా కి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది, కానీ నాకు స్వతంత్రం ఇప్పుడు వచ్చింది ” అంటు నవ్వుతు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు జగపతి బాబు గారు.

