సీనియర్ హీరోయిన్లు వరుసగా పెళ్లి మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా సరే.. ఇక పెళ్లి పీటలెక్కాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్ హన్సిక చేరింది. 50కి పైగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది హన్సిక. ఇంకా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అలుపే లేకుండా ప్రేక్షకులకు తన నటనా కౌశలాన్ని చూపుతోంది..సినిమా ఇండస్ట్రీలో ఇంత కాలం సంతోషంగా జీవించానని, ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తోంది హన్సిక.
మొన్నటిదాకా పెళ్లి ఎప్పుడు అమ్మడూ.. అని అడిగితే.. అప్పుడే తొందర ఎందుకు.. అంటూ జవాబిచ్చిన హన్సిక.. ప్రస్తుతం తన పెళ్లి పనులు ఎవరికీ చెప్పకుండా చక్కదిద్దుకుంటోందని తెలుస్తోంది. హన్సిక పెళ్లి కోసం జైపూర్ లో సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వివాహాన్ని అత్యంత వైభవంగా జరుపుకొనేందుకు ఆమె ప్లాన్ చేసిందట. దీంతో తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నట్లు స్పష్టమవుతోంది..!!