in

anushka shetty’s Next movie In Deep Trouble!

నాని అంటే సుందరానికీ, నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి కథలు కలసిపోయాయి. ఎలా జరిగిందో కానీ ఒకే పాయింట్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు సినిమాలు ఒకే పాయింట్ తో తెరకెక్కుతున్నాయని తెలిసింది. నవీన్ పొలిశెట్టి, అనుష్కతో యువీ క్రియేషన్స్ఓ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా దాదాపుగా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకి రీసెంట్ గా విడుదలైన ‘స్వాతిముత్యం’ టెన్షన్ పట్టుకుంది.

బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘స్వాతిముత్యం’. దసరా సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. సరోగసీ కాన్సెప్ట్ తో క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొంది ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ కి నవీన్ పొలిశెట్టి అనుష్క జంటగా నటిస్తున్న సినిమా కాన్సెప్ట్ కి దగ్గరి పోలికలున్నాయని భోగట్టా. దాదాపుగా పాయింట్ ఒకటేనని ఇన్ సైడ్ టాక్.

ఆల్రెడీ షూటింగ్ పుర్తయింది. ఇప్పుడు మార్పులు చేసే అవకాశం కూడా లేదు. ‘స్వాతిముత్యం’ను రెండు పెద్ద సినిమాల మధ్య హడావిడాగా విడుదల చేసేయడానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. మరీ ఆలస్యం చేస్తే కాపీ మరక అంటుకునే అవకాశం వుందని భావించిన నిర్మాతలు ఆగమేఘాలు మీద రిలీజ్ చేసేశారు. మరి నవీన్ పోలిశెట్టి సినిమా ఏమౌతుందో చూడాలి..!!

Ori Devuda!

anasuya to quit anchoring role?