అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ‘ఘాటీ’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు అనుష్క దూరంగా ఉండనున్నారని నిర్మాత రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, తాము దానిని గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు..
ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమా ప్రారంభానికి ముందే ప్రమోషన్లకు హాజరు కాలేనని అనుష్క మాకు చెప్పారు. బహుశా ప్రీ-రిలీజ్ వేడుకకు కూడా ఆమె రాకపోవచ్చు. అయినా మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే ‘షీలా’ పాత్రలో అనుష్క జీవించారు. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తన నటనతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆమెకు ఉంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు..!!