టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో మొదటి పేరు ప్రభాస్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ల లిస్ట్ తీస్తే అనుష్క పేరు ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. వీరిద్దరికి వివాహం జరగబోతుందని గతంలో ఎన్నోసార్లు పుకార్లు తెరమీదకు వచ్చాయి. కానీ దాదాపు అనేక సందర్భాల్లో వీరు అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వచ్చారు. నిజంగా వీరి మధ్య ఏమైనా ఉందో లేదో తెలియదు కానీ ఇద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధాలు అయితే ఉంటాయి. ఇటీవల కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా అనుష్క హాస్పిటల్ కి వెళ్లి మరీ ఆయన పార్థివదేహాన్ని సందర్శించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే అనుష్క తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో సరికొత్త వాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఒక గోల్డ్ బిజినెస్ చేసే వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతానికి అనుష్క వయస్సు 40 కి దగ్గర పడింది. ఆమెకు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు కూడా సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహానికి సిద్ధమవుతున్నట్లు సరికొత్త ప్రచారం జరుగుతోంది..!!