ఎందరో స్టార్ హీరోయిన్లు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన వారు కొందరు ఉన్నారు, సమంతా ఇటీవల తన ‘మైయోసిటిస్’ వ్యాధి గురించి వెల్లడించింది..శ్రుతి హాసన్ కూడా ‘పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్’ మరియు ‘ఎండోమెట్రియోసిస్’ తో తన పోరాటం గురించి మాట్లాడింది. అలాగే ఈమధ్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య తన గుండె సంబంధిత వ్యాధి గురించి కూడా చెప్పొకొచ్చింది..వీటన్నిటికీ బిన్నంగా మన స్వీటీ అనుష్క ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతోందట..అదేంటో తెలుసా?? నవ్వు వ్యాధి..అవును మీరు చదివింది కరెక్టే..!!
ఒక్కసారి స్టార్ట్ చేస్తే 15-20 నిమిషాల పాటు కంటిన్యూగా నవ్వుతూనే ఉంటానని అనుష్క చెప్పింది. తన నవ్వు ఆపుకోలేక టీమ్ మొత్తం షూటింగ్‌ను పాజ్ చేయాల్సి వచ్చిందని, అదే తన ప్రధాన సమస్య అని ఆమె పేర్కొంది. ఆమె నవ్వు ఆపుకునే సమయానికి ప్రొడక్షన్ టీం స్నాక్స్ మరియు టిఫిన్లు పూర్తి చేస్తుందని చెప్పింది. నవ్వడం మంచి ఆరోగ్యం మరియు అనుష్క యొక్క ప్రధాన ఆకర్షణ..ఆమెది ఒక అందమైన మరియు హృదయపూర్వక చిరునవ్వు అని ఆమె అభిమానులు అంటున్నారు. అనుష్క ప్రెసెంట్ జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో జతగా ఒక సినిమా చేస్తుంది..!!