క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. విక్రమ్ ప్రభు హీరోగా నటించగా, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.
“ఘాటీలో చేసిన శీలావతి ఒక అద్భుతమైన పాత్ర. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాగే ఈ పాత్ర కూడా బలంగా ఉండి, కొత్త షేడ్స్‌తో ఉంటుంది. క్రిష్ గారు ఎప్పుడూ మహిళల బలాన్ని చూపించే పాత్రలు ఇస్తారు. ఈ కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. లొకేషన్స్ కూడా కొత్తగా ఉంటాయి, ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి” అని తెలిపారు..!!