బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనుష్క, ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన అనుష్క ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మరి ప్రస్తుతం సినిమాలలో నటిస్తోంది. తాజాగా అనుష్క శెట్టి రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
అనుష్క గతంలో ఒకో చిత్రానికి రూ .4 కోట్లు రూపాయలు తీసుకున్న..ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .7 నుంచి రూ.8 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. అనుష్క నటించిన మిస్ శేట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె చెఫ్ గా కనిపించబోతోంది అలాగే కమెడియన్ నవీన్ పోలిశెట్టి కూడా ఇందులో నటించారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందంతో పాటు అనుష్క అభిమానులు కూడా చాలా ధీమాతో ఉన్నారు..!!