అనుష్క కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో మొదటిగా వచ్చే సినిమా అరుంధతి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా అనుష్కని చాలా మంది జేజమ్మ అని అంటారు. అంతలా గుర్తుండిపోయింది అరుంధతి సినిమా. అరుంధతి తెలుగులో మాత్రమే కాకుండా బెంగాలీలో కూడా రీమేక్ అయ్యింది. అరుంధతి సినిమాకి అనుష్క నటనతో పాటు సోను సూద్ పర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్, కూడా హైలైట్ గా నిలిచాయి. అసలు మనం అరుంధతి పాత్రలో అనుష్కను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం.
అరుంధతి అంటే అనుష్క, అనుష్క అంటే అరుంధతి, అనే అంత కరెక్ట్ గా అనుష్క అరుంధతి పాత్రకి సరిపోయారు. కానీ, అసలు అరుంధతి సినిమాలో అరుంధతి పాత్రకి ముందుగా అనుకున్నది అనుష్కని కాదు. అరుంధతి సినిమాలో లీడ్ రోల్ కి ముందుగా మమతా మోహన్ దాస్ ని అనుకున్నారు. ఈ పాత్ర కోసం మమతా మోహన్ దాస్ ని సంప్రదించారు. సినిమాకి కొంచెం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉండడంతో మమతా మోహన్ దాస్ ఈ పాత్ర చేయలేకపోయారు. తర్వాత అనుష్కని సంప్రదించారు…
ఇంత పవర్ ఫుల్ రోల్ పోషించడాన్ని ఛాలెంజ్ గా స్వీకరించి అనుష్క సినిమా చేయడానికి అంగీకరించారు.అరుంధతి ముందు కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ అరుంధతి సినిమాతో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు రావడం మొదలయ్యాయి. అనుష్క అరుంధతి సినిమాలో తన నటనకి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకోవడమే కాకుండా, మనందరికీ కూడా ఇంకా చేరువయ్యారు. అల మమతా నో చెప్పడం..అనుష్క ఒప్పుకోవడంతో తన కెరీర్ ఆ సినిమాతో పూర్తిగా మారిపోయింది..దీనికి మమతా కూడా ఒక రిసానే కదా మరి..