యువనటి అనుపమ పరమేశ్వరన్ కు సినీ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇతర హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే… అనుపమ మాత్రం సంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే పాత్రలను పోషిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల తెలుగులో ఆమెకు అవకాశాలు కొంత తగ్గినప్పటికీ… మలయాళంలో మాత్రం బిజీగా ఉంటోంది.
మరోవైపు అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే..తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఓపికగా, ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చింది. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెకు చిరాకు కలిగించాడు. బికినీ ధరించిన ఫొటోను షేర్ చేయాలని ఆమెను కోరాడు. దీంతో అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘నీ అడ్రస్ పంపు… ఆ అడ్రస్ కు ఫొటో పంపుతా… ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో’ అంటూ ఘాటుగా అనుపమ సమాధానమిచ్చింది.