తెలుగులో ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైనప్పటికీ, కెరీర్ తొలినాళ్లలో తనకు నటన రాదంటూ పలువురు తీవ్రంగా ట్రోల్ చేశారని అనుపమ గుర్తుచేసుకున్నారు. ఆ మాటలు మొదట్లో బాధపెట్టినా, అవే తనలో పట్టుదల పెంచాయని, నటిగా తనను తాను నిరూపించుకోవాలనే కసిని రగిలించాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు..
అయితే, ఈ విమర్శలే తనను తాను మెరుగుపరుచుకోవడానికి, మంచి కథలను ఎంచుకోవడంలో మరింత జాగ్రత్త వహించడానికి దోహదపడ్డాయని అనుపమ వివరించారు. విమర్శల ఫలితంగా తన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, ప్రేక్షకులను మెప్పించే బలమైన కథలను మాత్రమే ఎంచుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తనపై నమ్మకముంచి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ JVSK వంటి అద్భుతమైన చిత్రంలో అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు..!!