
కార్తికేయ-2′ సినిమా షూటింగ్ గుజరాత్లో జరుగుతున్న సమయం అది. షూటింగ్ స్పాట్లో ఒక చిన్న మేకపిల్ల తిరుగుతుండేది. జంతువులంటే ఎంతో ప్రేమ ఉన్న అనుపమ, ఆ మేకపిల్లతో షూటింగ్ విరామంలో ఆడుకునేవారు. దానికి ఆహారం పెడుతూ, దానితో గడుపుతూ షూటింగ్ విరామ సమయాలను గడిపేవారు. ఓ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో చిత్ర యూనిట్ అందరికీ మటన్ బిర్యానీ వడ్డించారు. అనుపమ కూడా ఎంతో ఇష్టంగా ఆ బిర్యానీ తింటున్నారు..
అదే సమయంలో ఆమె దగ్గరికి వచ్చిన అసిస్టెంట్..నవ్వుతూ ఒక మాట చెప్పాడు. “మేడం..మీరు తింటున్నది మీరు పొద్దున ఆడుకున్న ఆ మేకపిల్లనే” అని అన్నాడు. ఆ మాట వినగానే అనుపమ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తింటున్న ముద్ద కూడా గొంతు దిగలేదు. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెకు వెంటనే వాంతులు అయ్యాయి. తాను ఎంతో ప్రేమగా ఆడుకున్న మూగజీవాన్ని తన కళ్లముందే చంపి, ఆహారంగా పెట్టారనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు..!!

