
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే..ఎవరో కొందరు గత కొన్ని రోజులుగా తన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారని, పైగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,, దీనికితోడు తనకు తెలిసిన వ్యక్తులను కూడా ఆ పోస్ట్ లకు ట్యాగ్ చేశారని ఆమె రాసుకొచ్చింది. ఐతే, ఈ పోస్ట్ లు చేస్తున్న వ్యక్తి గురించి తాజాగా క్లారిటీ వచ్చింది.
తమిళనాడుకు చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి దీని వెనుక ఉందని, ఆ అమ్మాయి అనేక నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సృష్టించి, అనుపమను లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ విషయం పై అనుపమ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆ అమ్మాయిని చాలా త్వరగా గుర్తించారు. ఐతే, ఆమె వయస్సు కేవలం 20 ఏళ్ళు కారణంగా..ఆమె పేరును వెల్లడించకూడదని అనుపమ పోలీసులను కోరడం విశేషం. కేసు మాత్రం సాధారణంగా కొనసాగుతుందని, కానీ ఆ అమ్మాయి గుర్తింపును బహిర్గతం చేయడం ద్వారా ఆమె భవిష్యత్తు పాడు అవుతుందని అనుపమ తెలిపింది..!!

