అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. కాగా కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా కిష్కింధపురి ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..
ఈ సందర్బంగా హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ..నాకు హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టం. నా మూడేళ్ల వయసు నుంచే హారర్ మూవీస్ చూసాను. నా జుట్టు చూసే ఈ అవకాశాలు వచ్చాయి అనుకుంటాను. కౌశిక్ నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. అతను చెప్పిన ఫ్లో నాకు నచ్చింది. కౌశిక్ తో పని చేయడం అద్భుతంగా అనిపించింది. స్క్రిప్ట్ పై ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి. డబ్బింగ్ స్టూడియోలో ఇంతలా నన్ను టార్చర్ చేసిన తెలుగు డైరెక్టర్ మరెవరూ లేరు అని నవ్వుతూ తెలిపారు అనుపమ..!!