in

Anupama Parameswaran about her marriage!

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్లలో అనుపమ మంచి యాక్టివ్‌. ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటూ వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులిస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు 8 మిలియన్‌కు పైగా ఫాలోయర్స్ ఉండటం గమనార్హం. సాధారణంగా సినీ తారలకు ఎదురయ్యే తప్పనిసరి ప్రశ్న.. “పెళ్లెప్పుడు చేసుకుంటారు?”.. అనేది. అనుపమకు సైతం ఆ ప్రశ్న ఎదురైంది. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చిందామె.

అవును. ఓ అభిమాని అనుపమను పెళ్లెప్పుడు ప్లాన్ చేస్తున్నారని అడిగాడు. దానికి అనుపమ, “నా వయసు పాతికేళ్లు. దాని గురించి అప్పుడే అడగొద్దు. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది. నేనింకా చిన్నదాన్నే. సమీప కాలంలో పెళ్లి చేసుకోనే ఆలోచనే లేదు” అని తేల్చేసింది. ఇదివరకు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ రూమర్స్ వచ్చాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని ఆమె స్పష్టం చేసింది.

monal reveals about her breakup love story!

sai pallavi signs 5 telugu projects!