ఈచిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్టుగా సమాచారం. అయితే.. ఇప్పుడు విలన్లు కూడా ఇద్దరు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఉండగా.. ఇప్పుడు అనిమల్ అబ్రార్ కూడా జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అనిమల్‌లో క్రూరమైన విలన్ పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్.. ఇప్పుడు దేవరలో కూడా నటించనున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే కొరటాల శివ, బాబీ డియోల్‌కు కథ వినిపించాడని, దేవర మొదటి భాగం క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ట్విస్ట్ ఇస్తుందని, ఆ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని..బాబీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన సెకండ్ పార్ట్‌లో బాబీ డియోల్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడన్న మాట. ఇదే నిజమైతే..దేవర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు..!!